కన్య మరియ గర్భమునుండి (3)
కన్య మరియ గర్భమునుండి
రక్షకుడు జన్మించాడు
మానవాళి రక్షణ కొరకు
మనిషిగా వచ్చాడు
నీకై దిగి వచ్చెను
నిన్ను ప్రేమించెను
నీకు తోడెయుండును
1. ప్రజలందరికి కలగబోవు
మహా సంతోషకరమైన
శుభవర్తమానం ఇదే
సమధానం కలుగునుగాక
దైవకుమారుడే శిశువుగా జన్మించే
సంతోషం మహానందమే
|కన్య మరియ|
2. తూర్పుదేశ జ్ఞానులు తారను చూచి
వెంబడించి పశువుల పాకను చేరి
సాగిలపడి పూజించిరి
కానుకలే అర్పించిరి
నీదు హృదయంబును
తనకై కానుకగా
నేడే సమర్పించుము
|కన్య మరియ|