ఎవరెళతారూ (new 2)
ఎవరెళతారూ? - ఎవరెళతారు? అని
ప్రభువే అడిగే ప్రశ్నకు జవాబు నీవని
ఎవరెలతారో!! - ఎవరో వెళతారు! అని
మదిలో మెదిలే కలతకు కారణం నీవని

తెలిసిన నా ప్రాణమా - తెలుపలేక మౌనమా
తెలిసే నిను పిలిచెను - తెలుపగా యేసువార్తను
గొప్ప దేవుని ప్రేమను - లోకానికి చూపగనూ
నశించెడి వారికి - రక్షణ వార్తను చాటగనూ

1. పోనూ, సరిపోను అని మోషే అంటూ ఉంటుంటే
ఉన్నా, నేనున్నా అని యెహోవా సెలవిచ్చెన్
'నేను' అనే కర్రను పాడేస్తే "నేనే" అని దేవుడు వస్తాడు
స్వరము విని సర్వము వదిలేస్తే సర్వాధికారి నీకున్నాడు.

2. లేనూ, పోలేను అని యోనా దాగిపోతుంటే
లేవా, చూడలేవా నా మనసులో విచారణ
సర్వలోక ప్రజలంతా సర్వోన్నతుని సృష్టియెగా
సర్వము ధారపోసిన యే
సే విధేయతే మాదిరి... (2).

3. దేశం విడిచి సౌఖ్యం మరచి సాక్ష్యం నిలిపేయపోస్తులలు
భాగ్యం మనకు వాక్యం అందించే మిషనరీలు
ఇంత గొప్ప సాక్షి సమూహం నీలో స్ఫూర్తినివ్వలేదా
అంత కంటే గొప్ప కార్యాలు యేసు నీతో చేయలేడా..
 0:00    
  0:00

Audio

 0:00    
  0:00

Track