దేవుని రాజ్యముకై (నీతో 9)
దేవుని రాజ్యముకై జీవితమంతయును - ఏ పరిస్థితికైనను
తగినట్లుగను నిలువుము ప్రభు కృపతో బలముగను
లోకము రక్షణకై యేసుడు ప్రాణమిదె
శ్రమపడుము నీవును సువార్త పనిలో
బాధ్యతలన్నిటిని నెరవేర్చు
1. వాగ్దాన దేశము స్వాధీనపరచుకో
ప్రభువుతో సత్వరమే
ప్రభువులో నిలువుము, ప్రభుతో నడువుము
నిలువుము ప్రభుతోనే
సర్వంగా కవచముతో నిలుచుండి
చూడుమిక యుద్ధము యెహోవాదే
2. దావీదు దీనుడై తన తరమునకు సేవను చేసెగదా
వైరులనుండి ప్రజలను కాచి దేవుని సేవించే
రక్షించు నీ ప్రజను సాతాను చెరనుండి
అక్షయుడగు ప్రభుని సతతము సేవించు
3. అధికారులను, ప్రధానులందరిన్ నిరాయుధుల జేసి
జయోత్సవముతో మరణమున్ గెల్చిన క్రీస్తే విజయుండు
నీ ప్రభు క్రీస్తేసే, విజయము నీదే గదా
గెలువుము ఆత్మలను ప్రతి పట్టణమందు