లోకములో తెల్పెదము (నీతో 10)
లోకములో తెల్పెదము నీ ప్రేమను
జనులందరికి ప్రచురించెదము నీ శుభవార్తను

నీ ప్రేమే మానవ రక్షా
నీ ప్రేమే యేసయ్య
నీ సువార్త రక్షణ మార్గం
ఈ సృష్టిలో యేసయ్య

1. మానవ పాప పరిహారం చేసిన యేసయ్య
నరులకు నరకమునుండి విడుదల నీవయ్య
ఈ శుభవార్తను లోకములో అంతట తెల్పెదము
నీ కృపయే శరణమని ఘనముగ చాటుదము

2. ధరలో నరులను చూచి పరితాపమునొంది
నరులకు రక్షణ చాటగా మమ్మును పిలిచితివి
నీ పిలుపే భాగ్యమని మేము వెళ్ళెదము
నీ సేవే ధన్యతని నిను చాటించెదము

3. సర్వజనులలో నీ మహిమన్ ప్రచురించెదమయ్య
నీ అద్భుతముల నన్నిటిని వివరించెదమయ్యా
నీ రక్షణను దిన దినము ప్రకటించెదమయ్యా
నీ లోనే శాంతియని గానము చేసెదము
 0:00    
  0:00

Audio

 0:00    
  0:00

Track